లేటు వయసులో సుస్మితా సేన్ బాయ్ ఫ్రెండ్‌తో డేటింగ్

లేటు వయసులో సుస్మితా సేన్ చేసిన పనికి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గత కొంత కాలంగా సుస్మితా సేన్ …తన బాయ్ ఫ్రెండ్‌ రోహ్‌మన్ షాల్ అనే మోడల్‌తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో సుస్మితా ఎక్కడికి వెళ్లిన బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసే

దర్శనమిస్తోంది. వీళ్లిద్దరు కలిసివున్నఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం సుస్మితా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని వాళ్ల బాధ్యతలను చూసుకుంటుంది. రోహ్‌మన్ షాల్ విషయానికొస్తే..అతను సుస్మిత కన్నా 15 ఏళ్లు చిన్నవాడు. ఇక వీరిద్దరికి పెళ్లి సుస్మిత దత్త

పుత్రికలు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. తాజాగా సుస్మిత..తన బాయ్ ఫ్రెండ్ తనను ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేస్తూ.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని చెప్పకనే చెప్పింది.వీరి పెళ్లి నవంబర్‌లో లేదా డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉంది. సుస్మిత పెళ్లి చేసుకుంటున్న విషయం

తెలిసి కొంతమంది అభిమానులు.. సోషల్ మీడియాలో బెస్ట్ విషెస్ చెబితే.. మరికొందరు లేటు వయసులో ఇదంతా అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు. ఏమైనా సుస్మితా లేటుగా అయినా.. లెేటెస్ట్‌గా మంచి నిర్ణయం తీసుకుందని మెజారిటీ నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. సుస్మిత

విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంది. గతంలో ఈ భామ నాగార్జున హీరోగా నటించిన ‘రక్షకుడు’ సినిమాలో కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే కదా.

Related posts

Leave a Comment