అంతా అసత్యప్రచారం… తలసాని కుమారుడు క్లారిటీ

గోదావరి నది ఆంధ్రా నుంచి తెలంగాణకు వస్తుందని తాను చెప్పినట్టుగా సర్క్యూలేట్ అవుతున్న వీడియోపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు, టీఆర్ఎస్ నేత తలసాని సాయికిరణ్ యాదవ్ స్పందించారు. తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి కొంతమంది కావాలనే ఈ రకమైన కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. తాను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయాలను ఎడిట్ చేసి కొందరు కావాలనే ట్రోల్స్ చేశారని తలసాని సాయికిరణ్ యాదవ్ ఆరోపించారు. ఇలాంటి విషయాలను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

Related posts

Leave a Comment