కామ్రేడ్ లింగన్న మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించిన న్యూడెమోక్రసీ దళ సభ్యుడు కామ్రేడ్ లింగన్న మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.కామ్రేడ్ లింగన్న కడసారి చూపు కోసం రాష్ట్ర రైతు కూలీ సంఘం నాయకులు,ఐఎఫ్‌టీయూ నేతలు అక్కడికి వెళ్లారు.అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. రైతు కూలీ సంఘం నాయకులు ప్రభాకర్, ఐఎఫ్‌టీయూ సూర్య,పి.రామకృష్ణలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కాగా,రెండు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రోళ్లగడ్డ అటవీ ప్రాంతంలో కామ్రేడ్ లింగన్నను పోలీసులు కాల్చి చంపారు. లింగన్నను కాల్చి చంపడంతోస్థానిక గ్రామస్తులు పోలీసులపై ఎదురుతిరిగారు.వారిపైకి రాళ్లు రువ్వారు. లింగన్న మృతిని న్యూడెమెక్రసీ,తెలంగాణ ప్రజాస్వామిక వేదిక సహా పలు సంఘాలు ఖండించాయి.

Related posts

Leave a Comment