టీఆర్ఎస్‌పై విజయశాంతి ఫైర్

టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును మరోసారి తీవ్రంగా తప్పుబట్టారు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి. చార్మినార్‌ సమీపంలోని ఆయుర్వేద ఆస్పత్రి వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థినుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో మండిపడ్డారు. ఆయుర్వేద వైద్య విద్యార్థుల ఆందోళన

సందర్భంగా మహిళా విద్యార్థుల పట్ల హైదరాబాద్ పోలీసులు అనుచితంగా.. అసభ్యంగా వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలవంచుకునే విధంగా ఉందని విమర్శించారు. ఈ ఘటనను చూసిన తర్వాత మహిళల విషయంలోనూ విద్యార్థుల విషయంలోనూ టిఆర్ఎస్ అధినాయకత్వానికి టిఆర్ఎస్ పాలకులకు ఎంత చులకన భావం మరోసారి అర్థమవుతోందని విజయశాంతి ఆరోపించారు.

ఓ అనామక సంస్థకు టెండర్లు అప్పగించి ఇంటర్ విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న విషయాన్ని ఇంకా ఎవరూ మరిచిపోలేదని విజయశాంతి వ్యాఖ్యానించారు. విధి నిర్వహణలో ఉన్న అటవీశాఖకు చెందిన మహిళ ఉద్యోగిపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సోదరుడు ఆటవికంగా దాడి చేసినా…

కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకుందని ధ్వజమెత్తారు. తాజాగా ఆయుర్వేద కళాశాలకు చెందిన మహిళా విద్యార్థులపై పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల యావత్ రాష్ట్రం అట్టుడికిపోతున్నప్పటికీ టిఆర్ఎస్ పాలకులకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా అనిపించడంలేదని విజయశాంతి

మండిపడ్డారు. మహిళల భద్రత కోసం షి టీంలను ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్… మహిళ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని పట్టించుకోకపోతే మహిళల నుంచి వచ్చే తిరుగుబాటు ఎలా ఉంటుందో రుచి చూడాల్సి ఉంటుందని విజయశాంతి హెచ్చరించారు.

Related posts

Leave a Comment