పోసాని వైసీపీపై అలిగారా… జగన్‌పై అసంతృప్తి ?

Jagan meeting at Praja Vedika

కొన్నేళ్లుగా వైసీపీని, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంతగానో సమర్థిస్తూ వచ్చిన నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ప్రస్తుతం జగన్‌పై అసంతృప్తితో ఉన్నారా ? ఈ కారణంగానే ఆయన తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పరోక్షంగా జగన్ నిర్ణయాలను తప్పుబట్టారా ?

ఈ ప్రశ్నలకు రాజకీయవర్గాల్లో అవుననే సమాధానమే వినిపిస్తోంది. తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేశానని చెప్పిన పోసాని… ఆ విషయం కంటే ఎక్కువగా పలు కీలక అంశాలపై స్పందించడం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సినిమా ఇండస్ట్రీకి చెందిన పృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చిన సీఎం జగన్… అలీకి ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పదవి ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ప్రకటన వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పోసాని… పలు కీలక

వ్యాఖ్యలు చేయడం ఆసక్తిరేపుతోంది. వైఎస్ జగన్ పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారిలో కేవలం తాను, రోజా మాత్రమే ఉన్నామని… పోసాని కృష్ణమురళి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ రకంగా తాను మొదటి నుంచి జగన్‌తో ఉన్నాననే విషయాన్ని ఆయన పరోక్షంగా గుర్తు చేశారు.

అంతేకాదు మీ తరువాత పార్టీలో చేరిన వారికి పదవులు వచ్చాయి కదా అన్న ప్రశ్నకు కూడా పోసాని కాస్త విభిన్నంగా స్పందించారు. తన కంటే వారే పార్టీ కోసం ఎక్కువగా పని చేశారని పార్టీ నాయకత్వం భావించిందేమో అంటూ పార్టీ తీరుపై పరోక్షంగా తన అసంతృప్తిని పోసాని కృష్ణమురళి

వెళ్లగక్కారు. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన అలీకి కీలకమైన పదవి ఇవ్వనున్నారనే వార్తలు కూడా పోసానికి కోపం తెప్పించి ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు వైసీపీలో ఉన్న నటుడు పృథ్వీ చేసిన కీలక వ్యాఖ్యలను పోసాని ఖండించడం కూడా చర్చనీయాంశంగా మారింది.

Related posts

Leave a Comment