సోషల్ మీడియాలో..భార్య అసభ్య ఫోటోలు పెట్టిన భర్త

భార్య మెయిల్‌ ఐడీతోనే సోషల్ మీడియాలో అకౌంట్లో తెరిచి పిచ్చి పోస్టులు పెట్టాడు ఓ కీచక భర్త. కట్టుకున్న భార్య ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచి అసభ్యకర చిత్రాలు పోస్టింగ్‌తో వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి పోలీసుల్ని ఆశ్రయించడంతో… పోలీసులు పైశాచిక భర్తను అరెస్ట్ చేశారు. రాచకొండ

సైబర్‌క్రైమ్‌ ఏసీపీ హరినాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కల్వకోల్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌. 2011-13లో నగరంలో ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో స్టాఫ్‌నర్స్‌గా పనిచేసిన సమయంలో బాధితురాలితో పరిచయమైంది. ఆ

పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు కలిసి సినిమాలకు, షికార్లకు వెళ్లారు. ఆ సమయంలో సన్నిహితంగా ఉన్న చిత్రాలను సెల్‌ఫోన్‌లో తీసుకున్నారు.

2015లో బాధితురాలు మరో ఆసుపత్రిలో పనికి చేరింది. దీంతో తన అన్నతో కలిసి వనస్థలిపురంలో రూం అద్దెకు తీసుకొని ఉండేది. అదే సమయంలో నిందితుడు కూడా అదే ప్రాంతానికి వెళ్లి రూం అద్దెకు తీసుకున్నాడు. తరచూ బాధితురాలినికి కలిసేవాడు. ఈ క్రమంలో అదే ఏడాది మార్చి

28న వనస్థలిపురంలో వినాయకుడి ఆలయంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు వీళ్ల కాపురం సజావుగానే సాగింది. అయితే ఆ సమయంలో భార్య మెయిల్‌ ఐడీని వినియోగించి తన చరవాణిలో ఓ ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచాడు. ఆ ఖాతాను ఆమె కూడా తరచూ చూసేది.

గత జనవరిలో అతడి వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ ఖాతాలను చూసింది. అందులో పలువురు అమ్మాయిల ఫోన్‌ నంబర్లుండటంతో నిలదీసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో అతడు ఉద్యోగం వదిలి సొంతూరికి వెళ్లిపోయాడు. భార్యమీద కక్ష పెంచుకున్నాడు. ఆమె ఐడీతో ఉన్న

ఫేస్‌బుక్‌ ఖాతాలో ఆమెకు సంబంధించిన వ్యక్తిగత, అభ్యంతరకర చిత్రాలను అప్‌లోడ్‌ చేయడం ఆరంభించాడు. భార్యను తిడుతూ భయంకరమైన పోస్టులు పెట్టాడు. దీంతో ఇంటర్నెట్‌లో తన అసభ్య చిత్రాలను ఖాతాలో అప్‌లోడ్‌ చేయడం, వేధింపులకు దిగడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు

చేసింది. దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్‌ జలేంధర్‌రెడ్డి మంగళవారం నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Related posts

Leave a Comment