ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నారు ఏపీ సీఎం జగన్

Jagan meeting at Praja Vedika

ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. మధ్యాహ్నం 3.30 కి బేగంపేట లోని యూఎస్ కాన్సులేట కార్యాలయానికి ఆయన వెళ్లనున్నారు. ఇవాళ రాత్రికి లోటస్ పాండ్ నివాసంలోనే జగన్ బస చేసి… గురువారం సాయంత్రం హైదరాబాద్ నివాసం నుంచి

జెరూసలేం పర్యటనకు బయల్దేరి వెళ్తారు. తిరిగి ఐదో తేదీ మధ్యాహ్నం అమరావతి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి. జగన్ జెరూసలేం పర్యటన నేపథ్యంలో్ అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఇవాళ మధ్యహ్నం హైదరాబాద్ కు వచ్చిన తర్వాత శంషాబాద్ మండలంలోని

చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి కూడా జగన్ వెళ్లనున్నారు. అక్కడ సీఎం స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారని తెలుస్తోంది. మరోవైపు ఇటీవలే కర్నాటకలో బలపరీక్ష నెగ్గిన బీజేపీ నేత, సీఎం యడియూరప్ప కూడా చినజీయర్ స్వామిని కలిసి ఆశీస్సులు పొందనున్నట్లు తెలుస్తోంది.

Related posts

Leave a Comment