వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

pavankalyan

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేశారని… కాబట్టి పాలనపై ఆయనకు అవగాహన రావాలంటే కొంత సమయం పడుతుందని అన్నారు. కాబట్టి పాలన ఎలా ఉందని అనేది అర్థం చేసుకోవడానికి ఆయనకు

కొంత సమయం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. సరైన పాలన అందించని పక్షంలో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీద్దామని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. గుంటూరులో జనసేన తొలి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 25 పార్లమెంటరీ

నియోజకవర్గాల సమావేశాలు పూర్తయిన తరువాత ప్రతి నియోజకవర్గంలో బలంగా పనిచేసిన వ్యక్తులందరిని తానే స్వయంగా కలుస్తానని పవన్ అన్నారు.

జనసైనికులపై ఎక్కడైన దాడులు జరిగితే సహించేది లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. స్థానిక నాయకులు అండగా నిలబడాలని.. అవసరమైతే తానే రోడ్డు మీదకు వచ్చి కూర్చుంటానని అన్నారు. తనకు మొన్న జరిగిన ఎన్నికల్లో తక్కువ సమయం ఉన్నదని నేతలకు వివరణ ఇచ్చారు.

అపజయం వలన చాలా మంది వ్యక్తులు వెళ్లిపోయారని… అయితే రేపటి ఎన్నికల్లో మనతో నిజంగా నిలబడేవారు ఉంటారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏదో ఒకరోజు మనం కూడా బలమైన శక్తిగా మనం తయారవుతామని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.

Related posts

Leave a Comment