యాప్ వాట్సాప్‌లో త్వరలో మరొక అదిరిపోయే ఫీచర్

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్‌లో త్వరలో మరొక అదిరిపోయే ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐఫోన్, ఐప్యాడ్.. ఇలా ఏ డివైస్ అయినా సరే.. ఒక అకౌంట్‌ను కేవలం ఒక డివైస్‌లోనే వాడేందుకు వీలు ఉండేది. కానీ ఇకపై అలా కాదు. ఒక వాట్సాప్ అకౌంట్‌ను ఇకపై ఎన్ని డివైస్‌లలో అయినా వాడుకోవచ్చు. దీంతో ఒకేసారి ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లలో ఒక వాట్సాప్ అకౌంట్‌ను ఉపయోగించుకునేందుకు వీలు కలుగుతుంది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నందున త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తున్నది. దీన్ని మల్టీ ప్లాట్‌ఫాం సిస్టమ్ ఫీచర్‌గా వ్యవహరిస్తున్నారు.

Related posts

Leave a Comment