తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..

నిన్న మొన్నటిదాకా వర్షాలు లేక అల్లాడిన తెలంగాణలో గత కొద్దిరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు కూడా రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.రాజస్థాన్‌ నుంచి మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ఒడిశా వరకు

ఉపరితల ధ్రోణి విస్తరించి ఉండటంతో.. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. దీంతో విస్తారమైన వర్షపాతం నమోదవుతోంది. భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.నదిలో నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 23.9 అడుగులకు చేరుకుంది. భారీ వర్షాల కారణంగా

ఆర్కేపీ,మందమర్రి,రామగుండం,భూపాలపల్లిలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో పనులు నిలిచిపోయాయి.

భారీ వర్షాలతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మట్టిరోడ్లు కొట్టుకుపోవడంతో పట్టణాలకు చేరుకోవడానికి రవాణా వ్యవస్థ లేకుండా పోయింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో పలు వాగులు,వంకలు పొంగి పొర్లుతుండటంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలకు పట్టణాలతో సంబంధం

తెగిపోయింది. సోమవారం కుమ్రం భీమ్ జిల్లాలో విస్తారమైన వర్షపాతం నమోదైంది.ఒక్క బెజ్జూరులోనే 133.5మి.లీ వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి.హన్మకొండలో పగటివేళ సాధారణం కంటే 6.1డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది.

హైదరాబాద్‌లోనూ పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పడిపోయాయి.సోమవారం 4.8డిగ్రీలు తగ్గి 25.6డిగ్రీలుగా నమోదైంది. వాతావరణం చల్లగా మారడంతో.. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగం కూడా తగ్గిపోయినట్టు సమాచారం.రాష్ట్రంలో 25శాతం ప్రాంతాల్లో 7సెం.మీ-11సెం.మీ వరకు వర్షపాతం

నమోదైంది. 75శాతం ప్రాంతాల్లో 2సెం.మీ-6సెం.మీ వరకు ఒక మోస్తరు వర్షపాతం నమోదైంది.

Related posts

Leave a Comment