ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారిక హోదాలో తొలి విదేశీ పర్యటన

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారిక హోదాలో తొలి విదేశీ పర్యటన చేయనున్నారు. సీఎం జగన్ కుటుంబసభ్యులతో సహా ఆగస్టు 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జెరుసలేంలో పర్యటించి రాష్ట్రానికి తిరిగిరానున్నారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ వెంట వ్యక్తిగత సిబ్బందితో పాటు ఎస్ఎస్‌జీ ఎస్పీ సెంథిల్ కుమార్, సీఎం వ్యక్తిగత భద్రతా అధికారి జోషి వెళ్లనున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సీఎం. వైఎస్. జగన్మోహన్ రెడ్డి జెరూసలేం పర్యటన చేయడం విశేషం. పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ లోని క్రైస్తవ పవిత్ర స్థలాలతో పాటు క్రీస్తు జన్మస్థలం బెత్లహాంను సైతం సీఎం జగన్ సందర్శించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే స్వతహాగా దైవ చింతన ఎక్కువ కలిగిన జగన్ ఇప్పటికే పలుమార్లు జెరూసలేంను సందర్శించారు. వైఎస్ కుటుంబీకులు తరచూ జెరూసలేంను సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సైతం సీఎం హోదాలో జెరూసలేంలో పర్యటించారు. ప్రస్తుతం జగన్ సైతం తండ్రి బాటలోనే పవిత్ర స్థలాల సందర్శన చేపట్టారు. ఇదిలా ఉంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం ఈ నెల 28న అమెరికా వెళ్లనున్నారు.

Related posts

Leave a Comment