మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మానవత్వాన్ని చాటుకున్నారు. తనవద్ద పనిచేసిన గన్‌మెన్ శ్రీనివాస్ అకాలమరణం చెందడంతో అతడి కుటుంబానికి రూ.10లక్షల సాయం అందించారు. మంత్రి దయాకర్ రావు చేతుల మీదుగా చెక్కు అందజేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వద్ద గన్ మెన్‌గా పనిచేసిన శ్రీనివాస్ చనిపోవడంతో ఆయన కన్నీరు పెట్టుకున్నారు. తన సొంత సోదరుడు చనిపోయినంత బాధపడ్డారు. స్వయంగా గన్ మెన్ శవాన్ని మోశారు. అతడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అన్నమాట నిలబెట్టుకున్నారు. తాను మాటలకు పరిమితం కానని మానవత్వాన్ని చాటుకున్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో తన అనుచరులు, ఆత్మీయుల వద్ద నుంచి పదిరోజుల తక్కువకాలంలో కొంత నగదు శ్రీనివాస్ కుటుంబం కోసం సేకరించారు. మరికొంత తాను జమచేసి అక్షరాలు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబానికి మంత్రి దయాకర్ రావు చేతులమీదుగా అందజేసారు. శ్రీనివాస్ పిల్లల భవిష్యత్ కు తాను భరోసా ఇస్తానని చెప్పారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మరోసారి కంటతడి పెట్టుకున్నారు. శ్రీనివాస్ కుటుంబానికి దైర్యం చెప్పారు. ఏదో ఉద్యోగులు, వస్తుంటారు పోతుంటారు అన్నట్లు కాకుండా… ఊహకందనంత ఆర్దికసహాయం అందించిన ఎమ్మెల్యే శంకర్నాయక్ గొప్పమనుసును చాటుకున్నారు.

Related posts

Leave a Comment