కోర్టుల జోక్యం తగదు ఎర్రమంజిల్ భవనం కూల్చివేతపై తెలంగాణ సర్కార్

highcourt

ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతపై హైకోర్టులో నేడు కూడా విచారణ కొనసాగింది. ప్రస్తుతం అసెంబ్లీ ఉండగా కొత్త అసెంబ్లీ భవనం ఎందుకని నిన్న జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ నేడు వాదనలు వినిపించారు.

విధానపరమైన నిర్ణయాల్లో కోర్టుల జోక్యం తగదన్న ఆయన వాదించారు. ఇందుకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను ఆయన ప్రస్తావించారు. అసెంబ్లీ నిర్మాణానికి ప్లానింగ్ లేకుండా హెచ్ఎండీఏ నుంచి అనుమతి తీసుకోలేమని ప్రభుత్వం కోర్టుకు వివరించింది.

విస్తీర్ణం చూసిన తరువాతే హెచ్ఎండీఏ అనుమతి కోరతామని స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రజాధనం దుర్వినియోగం చేయడం లేదని వాదించింది. ప్రస్తుతం అసెంబ్లీ భవనం 102 ఏళ్లనాటిదని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం…అసెంబ్లీకి ఉండాల్సిన వసతులు, సౌకర్యాలు లేవని వివరించింది. అయినా

అప్పటి భవనం అసెంబ్లీ కోసం నిర్మించింది కాదని… కేవలం నాటి రాజు కోసం నిర్మించారని ప్రభుత్వం వాదించింది. ప్రభుత్వం తరపున వాదనలు విన్న హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు విచారణ సందర్భంగా ఆర్ అండ్ బి ఇంజనీర్ చీఫ్ కోర్టుకు రావాలని ఆదేశించింది.

Related posts

Leave a Comment