టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అరెస్టు చేయండి

శ్రీకాకుళం జిల్లా టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి అచ్చెన్నాయుడు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందున ఆయనను తక్షణం అరెస్టు చేయాలని ఆ జిల్లా వైసీపీ నేత హోంమంత్రి మేకతోటి సుచరితకు ఫిర్యాదు చేశారు. పన్నెండేళ్ల క్రితం 2007లో ఓబులాపురం మైనింగ్‌ కార్యాలయం వద్ద

అచ్చెన్నాయుడు దౌర్జన్యానికి పాల్పడ్డారని, ఆ సమయంలో అతనిపై కేసు నమోదైందని శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం, టెక్కలి నియోజకవర్గం ఇన్‌చార్జి పేరాడ తిలక్‌ ఫిర్యాదులో ప్రస్తావించారు. కానీ ఈ విషయాలను తన అఫిడవిట్‌లో పేర్కొనకుండా అచ్చెన్నాయుడు దాచిపెట్టారని

ఆరోపించారు. అలాగే, రాయదుర్గం కోర్టు కేసులో కూడా అచ్చెన్నాయుడు 21వ ముద్దాయిగా ఉన్నారని, కోర్టుకు హాజరుకానందున ఆయనపై అరెస్టు వారెంటు కూడా జారీ అయ్యిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశాల ప్రాతిపదికన తక్షణం అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలని తిలక్

డిమాండ్‌ చేశారు.

Related posts

Leave a Comment