అసెంబ్లీ కోసం కొత్త భవనం ఎందుకు ?… హైకోర్టు కీలక వ్యాఖ్యలు

highcourt

ఎర్రమంజిల్ భవనం కూల్చివేతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ప్రజాధనం దుర్వినియోగం చేసేందుకే ఎర్రమంజిల్‌లో కొత్త అసెంబ్లీ భవనం నిర్మిస్తున్నారని దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ కాదని కొత్త భవనం నిర్మించాల్సిన అవసరం ఏంటని

ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పుడున్న అసెంబ్లీలో అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా అని హైకోర్టు పేర్కొంది. ఉన్న అసెంబ్లీలో లేని ఏయే సౌకర్యాలను కొత్తగా నిర్మించబోయే అసెంబ్లీలో కల్పించబోతున్నారని వ్యాఖ్యానించింది. భవనం కూల్చేవేతకు సంబంధించి హెచ్ఎండీఏ అనుమతి

తీసుకున్నారా అని ప్రభుత్వం తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. అనుమతి ఉందో లేదో చెప్పడానికి ఆలస్యం ఎందుకు అని వివరణ కోరింది. వాస్తవ పరిస్థితిపై కోర్టుకు నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

Related posts

Leave a Comment