వైగో రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయండి: సుబ్రహ్మణ్యస్వామి లేఖ

ఎండీఎంకే అధినేత వైగో ఇటీవలే డీఎంకే సహకారంతో రాజ్యసభలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి లేఖ రాశారు. హిందీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం

ద్వారా రాజ్యాంగాన్ని వైగో ఉల్లంఘించారని లేఖలో ఆరోపించారు. హిందీ భాషకు వ్యతరేకంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 351ని వైగో ఉల్లంఘించారని తెలిపారు. ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగించాలని కోరారు. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగే అర్హత వైగోకు ఉందో? లేదో? ఎథిక్స్ కమిటీ తేలుస్తుందని చెప్పారు.

హిందీ అనేది అభివృద్ధి చెందిన భాష కాదని… హిందీలో రాసిన ఒకే ఒక పుస్తకం రైల్వే టైమ్ టేబుల్ మాత్రమేనని వైగో వ్యాఖ్యానించారని సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. ఇది భారతీయులందరినీ కించపరచడమే అవుతుందని చెప్పారు. పార్లమెంటులో దేశ ప్రధాని ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడాలని

కూడా వైగో వ్యాఖ్యానించారని తెలిపారు. ఆర్టికల్ 351 ప్రకారం హిందీ అధికార భాషగా చెలామణి అవుతోందని చెప్పారు

Related posts

Leave a Comment