ఏపీ శాసనమండలిలో వైసీపీతో పోలిస్తే టీడీపీ సభ్యుల బలం పలురెట్లు ఎక్కువ

ap-assembly

ఏపీ శాసనమండలిలో వైసీపీతో పోలిస్తే టీడీపీ సభ్యుల బలం పలురెట్లు ఎక్కువగా ఉంది.తొలిసారి అదికారంలోకి వచ్చిన వైసీపీ తరఫున సహజంగానే ఎక్కువ మంది సభ్యుల ప్రాతినిధ్యం లేదు. దీంతో టీడీపీ సభ్యుడే ఛైర్మన్ గా కూడా ఉన్నారు. దీంతో మంత్రులు మండలికి వస్తే టీడీపీ ఎమ్మెల్సీల

ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే శాసనసభలో టీడీపీ సభ్యులు సంధిస్తున్న ప్రశ్నలకు కొందరు మంత్రుల వద్ద సమాధానాలు ఉండటం లేదు. అలాంటిది శాసనమండలికి వెళితే పరిస్ధితి ఎలా ఉంటుందో అన్న మీమాంస మంత్రుల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. శాసనసభలో అయితే తోటి వైసీపీ

సభ్యుల బలం మంత్రులకు కలిసివస్తుంది. ఏదైనా అంశంపై కాస్త అటుఇటుగా మాట్లాడినా సమాధానాలు అందించేందుకు వైసీపీ సభ్యులు ఎక్కువమంది ఉంటారు. అదే మండలిలో అయితే అలాంటి పరిస్ధితి ఉండదు. నామమాత్రంగా ఉన్న వైసీపీ సభ్యుల నుంచి తగిన సహకారం లభించకపోతే

మంత్రులు అభాసుపాలు కావాల్సి వస్తుంది. దీంతో మంత్రులు ఉద్దేశపూర్వకంగానే మండలికి వెళ్లడం లేదని తెలుస్తోంది.

శాసనసమండలికి మంత్రులు రాకపోవడంపై టీడీపీ ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి బడ్జెట్ పై తాము అడగాల్సిన ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారని వారు ప్రశ్నిస్తున్నారు. మండలికి మంత్రుల గైర్హాజరీపై మండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ ఎమ్మెల్సీలు సిద్దమవుతున్నారు. మంత్రులను మండలికి రప్పించేలా రూలింగ్ ఇవ్వాలని ఛైర్మన్ ను వారు కోరనున్నారు.

Related posts

Leave a Comment