ఏపీ ప్రభుత్వం ఆశా వర్కర్లను మోసం చేసింది.. నారా లోకేశ్

lokesh

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశా వర్కర్లను నిరాశ, నిస్పృహలకు గురిచేస్తోందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శించారు. జీతాలు బాగా పెంచాం అని ప్రచారం చేసుకుంటూ ఇంకా జీవోను విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మా కార్యకర్తలను ఆశా వర్కర్లుగా

పెట్టుకుంటాం. మీరు వెళ్లిపోండి’ అని ఇప్పటికే పనిచేస్తున్న ఆశావర్కర్లను వైసీపీ నేతలు వేధిస్తున్నారని ఆరోపించారు.

సీఎం జగన్ గారూ.. మీరు తరిమేస్తే ఆశా కార్యకర్తలంతా ఎక్కడకు వెళ్లాలి? అని లోకేశ్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్నవాళ్లు వెళ్లిపోయి వైసీపీ కార్యకర్తలు ఆశావర్కర్లు అయితే తప్ప జీతాలు పెంచరా? అని నిలదీశారు. ఈ చిరుద్యోగుల విషయంలో కూడా మీ పార్టీ వాళ్లు దోపిడీకి ప్లాన్ చేయడం సిగ్గుగా

అనిపించడం లేదా? మానవత్వం, మంచితనం పెంచుకోరా?అని దుయ్యబట్టారు. ఈ మేరకు లోకేశ్ ఈరోజు వరుస ట్వీట్లు చేశారు.

Tags : naralokesh , ap cm jagan , chandrababu , lokesh ,ap cm ,

Related posts

Leave a Comment