నేడే ఏపీ బడ్జెట్… ఏ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యం?

Jagan meeting at Praja Vedika

Andhra Pradesh Budget 2019-20 :కేంద్రంలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్… ఏపీ ప్రభుత్వానికి పన్నుల ఆదాయం తప్పితే… కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేకించి ఏమీ కేటాయించలేదు. అదే సమయంలో… ఏపీ ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో కీలకమైన మద్యం అమ్మకాలపై ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలతో… ఆ ఆదాయం కూడా తగ్గే పరిస్థితి. ఇలాంటి సమయంలో… వైసీపీ ప్రభుత్వ తొలి బడ్జెట్ ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాత్రం బడ్జెట్ రూపకల్పనపై సంతృప్తిగా ఉన్నారు.ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో తొలిసారిగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు బుగ్గన రాజేంద్రనాథ్. ఇదే సమయంలో శాసన మండలిలో రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ బడ్జెట్‌ సమర్పిస్తారు. ఇక ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న వ్యవసాయ బడ్జెట్‌ను పట్టణాభివృద్ధి శాఖ

మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో, మంత్రి మోపిదేవి వెంకటరమణ శాసన మండలిలో ప్రవేపెట్టబోతున్నారు.నిధుల కొరత ఉన్నప్పటికీ… ప్రభుత్వం మాత్రం మేనిఫెస్టోలో నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే లక్ష్యంగా తొలి బడ్జెట్‌ను రూపొందించింది. ఓ అంచనా ప్రకారం బడ్జెట్‌ రూ.2.31 లక్షల కోట్ల నుంచి రూ.2.32 లక్షల కోట్ల మధ్య ఉంటుంది. వ్యవసాయ బడ్జెట్ రూ.28 వేల కోట్లతో తయారుచేసినట్లు తెలిసింది.

ఖర్చులు తగ్గించుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు చెబుతున్న సీఎం జగన్… పొదుపు మంత్రం ద్వారా మిగిలే నిధులను ప్రజా సంక్షేమానికి సమర్థంగా వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిధులు వచ్చే ఏ మార్గాన్నీ వదలకుండా ప్రయత్నించడం ద్వారా… ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చవచ్చన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ప్రధానంగా బడ్జెట్‌లో అమ్మఒడి, YSR రైతు భరోసా, పేదల గృహాలు, వ్యవసాయం, నీటి పారుదల, విద్య, వైద్య రంగాలకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించారని తెలిసింది.

Related posts

Leave a Comment