అంత అప్పు ఎలా పెరిగింది.. మీ ప్రభుత్వం ఏమైనా చేసిందా? : శ్వేతపత్రంపై లోకేష్ రియాక్షన్

lokesh

ఏపీ ఆర్థికమత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేసిన శ్వేతపత్రంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. సాక్షి కథనాల లాగే ప్రభుత్వ శ్వేత పత్రం కూడా స్పష్టత,ఆధారం లేకుండా ఉందని ఎద్దేవా చేశారు. 2018-19 బడ్జెట్ ప్రకారం రాష్ట్ర అప్పు రూ.2లక్షల

49వేల కోట్లు అని.. కేంద్ర ఆర్థికమంత్రి కూడా గత వారం పార్లమెంటులో ఇదే విషయాన్ని చెప్పారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో రాష్ట్ర అప్పు రూ.3లక్షల 62కోట్లు అని పేర్కొనడమేంటని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఒకేసారి లక్ష కోట్ల అప్పు ఎలా

పెరిగిందని నిలదీశారు. అంటే, వైసీపీ ప్రభుత్వం ఏమైనా చేసిందా? అని ప్రశ్నించారు. కాగితాల మీద కనిపించిన వృద్ది రేటు..ఫీల్డులో కనిపించలేదంటున్నారంటే.. వృద్ది నమోదైందని మీ శ్వేతపత్రంలో ఉన్నట్టేగా అని ప్రశ్నించారు.మత్స్యశాఖ,పశుసంవర్ధక శాఖల అభివృద్దిని వ్యవసాయశాఖ

అభివృద్దిలో ఎలా చూపిస్తారని అడగడాన్ని తప్పు పట్టారు. ఆ శాఖల అభివృద్ది జరిగిందని ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు అని.. దేశమంతా వ్యవసాయ శాఖ అభివృద్దిని అలాగే లెక్క కడుతోందని చెప్పారు.

Related posts

Leave a Comment