కాళ్లు పట్టుకున్నమంత్రి ..క్లారిటీ ఇచిన హరీశ్ రావు

తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన కాళ్లు పట్టుకున్నట్టు వచ్చిన వార్తలపై మాజీమంత్రి, టీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావు స్పందించారు. ఈ వార్త పూర్తిగా అవాస్తవం అని వివరణ ఇచ్చారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేలమీది నుంచి లేచి నిలబడేందుకు ప్రయత్నిస్తుండగా తాను సాయం చేశానని హరీశ్ రావు క్లారిటీ ఇచ్చారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకుని కొందరు ఆయన తన కాళ్లు మొక్కినట్టు వార్త ప్రచురించారని అన్నారు. ఈ వార్తను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని హరీశ్ రావు అన్నారు. ఇది చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో ఇలాంటి వార్తలు ప్రచురించేముందు నిర్ధారణ చేసుకుని ప్రచురించాలని ఆయన మీడియా సంస్థలను కోరారు.

Related posts

Leave a Comment