ఆయిషామీరా హత్య కేసు నిందితుడు సత్యంబాబుకు పెళ్లి

విజయవాడలో సంచలనం సృష్టించిన ఆయిషా మీరా హత్య కేసు నందు నిర్దోషిగా విడుదల అయిన సత్యంబాబుకు గురువారం వివాహం జరిగింది. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన యువతితో సత్యంబాబుకు వివాహం జరిగింది. ఈనెల 4వ తేదీన సత్యంబాబు ఓ ఇంటివాడయ్యాడు. నిరాడంబరంగా

జరిగిన ఈ పెళ్లికి ఇరు కుటుంబాల బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సత్యంబాబుకు ఇది రెండో పెళ్లి. గతంలో మరదలితో అతడికి వివాహం జరిగింది. అయితే, వ్యక్తిగత కారణాలతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆయేషా మీరా హత్య కేసులో చిక్కుకున్న సత్యంబాబు తొమ్మిదేళ్లు జైలు శిక్ష అనుభవించాడు.

తొమ్మిదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన సత్యంబాబు. హైకోర్టు నిర్దోషిగా తేల్చడంతో కొన్ని నెలల కిందట జైలు నుంచి విడుదలయ్యాడు. జైల్లో ఉండగానే తండ్రి మరణం, పెళ్లీడుకు వచ్చిన చెల్లెలు, తల్లికి వయసు మీద పడటం లాంటి సమస్యలతో సత్యంబాబు మానసిక సంక్షోభకు గురయ్యాడు.

అయితే ఆయేషా మీరా కేసులో సత్యంబాబు నిర్దోషిగా బయటపడిన తర్వాత కథ సుఖాంతం అనుకున్న సమయంలో ఈ కేసు విచారణను హైకోర్టు సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు కేసును మళ్లీ మొదటి నుంచి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా సత్యంబాబును ఇప్పటికే రెండుసార్లు ప్రశ్నించారు.

Related posts

Leave a Comment