తెలంగాణకు హరితహారం.. కేసీఆర్ కల సాకారమయ్యే దిశగా…

Haritha_Haaram

తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం ఇప్పుడు రాష్ట్రంలో సత్ఫలితాలను ఇస్తోంది. ఇందుకు ఉదాహరణ సిద్దిపేట జిల్లాలోని కోమటిబండ

గ్రామం.మూడేళ్ల క్రితం కోమటిబండ గ్రామంలో నాటిన మొక్కలు ఇప్పుడు దారి పొడవునా ఏపుగా పెరిగి వనాన్ని తలపిస్తున్నాయి. తెలంగాణలోని చాలా గ్రామాలకు ఈ చిత్రం అద్దం పడుతుందని చెప్పాలి. అడవుల విస్తీర్ణం తగ్గిపోయి ప్రకృతి విధ్వంసం పెరిగిపోయిన తర్వాత అటవీ జంతువులు

గ్రామాల్లోకి చొరబడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కోతులు జనవాసాల్లోనే ఎక్కువగా సంచరిచడం మొదలుపెట్టాయి.

అడవుల్లో చెట్లను నరికేయడంతో.. అక్కడ ఎటువంటి పండ్లు ఫలాలు దొరక్క ఇండ్ల మీద పడటం మొదలుపెట్టాయి. దీంతో కోతులు మళ్లీ అడవుల్లోకి వాపస్ వెళ్లాలి.. వానలు వాపస్ రావాలి అన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా హరితహారాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా

ప్రతీ గ్రామంలో మొక్కలు నాటారు. అలాగే అటవీ శాఖ అధికారులు అడవుల్లోనూ పండ్లు, ఇతరత్రా మొక్కల పెంపకాన్ని చేపట్టారు. హరితహారాన్ని ఓ ఉద్యమంలా చేపట్టడం ద్వారా అడవుల విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు.. తెలంగాణ అంతా పచ్చదనంతో కళకళలాడాలన్న ఉద్దేశంతో దీన్ని చేపట్టారు.

కోమటిబండ లాంటి గ్రామాలు పచ్చదనంతో కళకళలాడుతుంటే.. కేసీఆర్ సంకల్పం ఇప్పుడు సాకారమవుతున్నట్టే అనిపిస్తోంది.

Related posts

Leave a Comment