ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం

Jagan meeting at Praja Vedika

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్బన్ హౌజ్ ప్లాట్లపై రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కువ మంది రివర్స్ టెండరింగ్‌లో పాల్గొనేలా దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని చెప్పారు. కాంట్రాక్టర్లను వేధించడం తమ ఉద్దేశం కాదని.. తమకు

ఎవరిపై కక్ష లేదని అన్నారు. పేదలకు నష్టం కలిగించవద్దన్నదే తమ ఉద్దేశం అని స్పష్టం చేశారు. 20 ఏళ్ల పాటు నెలా నెలా డబ్బులు కట్టే స్థోమత పేదవాళ్ల వద్ద ఉండదన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని కుటుంబాలు ఉండవద్దని..ఇళ్ల కోసం ఒక్క పైసా కూడా వారు ఖర్చు చేయవద్దని అన్నారు. ఉగాది

నాటికి ఇళ్ల పట్టాలు,స్థలాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఒక్కో లబ్దిదారుడికి 1.5సెంట్ల చొప్పున స్థలాన్ని కేటాయించాలని సూచించారు. మంగళవారం అర్బన్ హౌజింగ్, రూరల్ హౌజింగ్‌పై జగన్ అధికారులు, మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

గత ప్రభుత్వం షీర్ వాల్ టెక్నాలజీతో ఇళ్లను నిర్మించడంతో పేదలపై భారం పడిందని జగన్ భావిస్తున్నారు.అంతేకాదు, అర్బన్ హౌజింగ్‌లో భారీగా అవకతవకలు జరిగాయని కూడా జగన్ సర్కార్ భావిస్తోంది. తాజా రివర్స్ టెండరింగ్ విధానంలో వీలైనంత తక్కువ ధరలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని

జగన్ యోచిస్తున్నారు.తక్కువ ధరలకు టెండరింగ్‌ వేసే కంపెనీలకు పనులు అప్పగించాలని ఆలోచిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు ఎంతో కొంత ఆదాయం ఆదా అవుతుందని అధికారులతో చెప్పారు. ఏదేమైనా ఏపీ సర్కార్ మొదటిసారి రివర్స్ టెండరింగ్‌కి వెళ్లడం చర్చనీయాంశంగా  మారింది.

Related posts

Leave a Comment