విజయనగరం జిల్లాలో రోడ్డుప్రమాదం…

-road-accident

విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 20మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. కాశీయాత్ర ముగించుకొని తిరిగి వస్తుండగా… బస్సు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది . జిల్లాలో

గరుగుబిల్లిమండలం ఖడ్గవలస గ్రామం వద్ద గౌరిశంకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపుతప్పి నాగావళి కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 20మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం పార్వతీపురం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారు కన్నెపుదొరవాసులుగా తెలుస్తోంది.

Related posts

Leave a Comment