పోలవరంపై జలవనరుల శాఖ నిఘా.. పెంటపాటి పుల్లారావుకు లేఖ రాసిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర జలవనరుల శాఖ నిఘా విభాగం ప్రముఖ సామాజికవేత్త పెంటపాటి పుల్లరావుకు లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి చోటుచేసుకుందని గతంలో పుల్లారావు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ‘ఆ ఫిర్యాదును చేసింది మీరేనా?’ అని నిఘా విభాగం ప్రశ్నించింది.

ఒకవేళ ఆ ఫిర్యాదును పుల్లారావే చేస్తే దాన్ని ధ్రువీకరిస్తూ జవాబు ఇవ్వాలని సూచించింది.

మీ ఆరోపణలను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నారా? అందుకు తగ్గ సాక్ష్యాధారాలు ఉన్నాయా? దర్యాప్తు అధికారికి ఈ విషయంలో సహకరిస్తారా?ఒకవేళ ఆరోపణలు రుజువు చేయలేని పక్షంలో నిబంధనల ప్రకారం మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఫిర్యాదును విస్మరిస్తాం. ఏ

విషయమో 15 రోజుల్లోగా జవాబు ఇవ్వండి అని కేంద్ర జలవనరుల నిఘా విభాగం లేఖ రాసింది. దీంతో పుల్లరావు స్పందిస్తూ .. ఫిర్యాదు చేసిందని తానేనని కేంద్రానికి తెలిపారు.

Related posts

Leave a Comment