తెలంగాణలో నేడు స్కూల్స్ బంద్‌

abvp

విద్యావ్యవస్థలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఏబీవీపీ విద్యార్థి సంఘం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ల బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డీఈవో,ఎంఈవో పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని, అన్ని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు

కల్పించాలని ఏబీవీపీ జాయింట్ సెక్రటరీ మర్రి శ్రవణ్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల నుంచి ఏ స్కూల్ ఎంతెంత ఫీజులు వసూలు చేస్తుందో.. ఆ వివరాలన్నీ బయటకు వెల్లడించాలన్నారు. ప్రతీ

ఒక్కరికి విద్యా హక్కును ఈ ఏడాది పకడ్బందీగా అమలుచేయాలని, స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌ను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.స్కూళ్లలో ప్లే గ్రౌండ్, ఫైర్ సేఫ్టీ,ల్యాబ్స్ వంటి కనీస సౌకర్యాలు ఉన్నాయో లేదో తనిఖీలు చేయాలన్నారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. అలాంటి స్కూళ్ల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

Related posts

Leave a Comment