ఉండవల్లి నుంచి మకాం మార్చే యోచనలో చంద్రబాబు..

Chandrababu-Naidu-

ఉండవల్లిలోని అక్రమ నిర్మాణం ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. ఆ తర్వాత చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని కూడా కూల్చివేస్తారన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నివాసం కూడా అక్రమ నిర్మాణమేనని వైసీపీ నేతలు చెబుతున్ననేపథ్యంలో అక్కడి నుంచి ఖాళీ చేసే

యోచనలో బాబు ఉన్నట్టు తెలుస్తోంది. అనువైన నివాసం దొరికిన వెంటనే, అక్కడి నుంచి ఖాళీ చేయాలని మెజార్టీ టీడీపీ నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. కాగా, చంద్రబాబు కొత్త ఇంటి కోసం పరిశీలనలో పలు గెస్ట్ హౌస్ లు ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. క్వాలిటీ ఐస్ క్రీమ్ గెస్ట్ హౌస్,

గామన్ ఇండియా అతిథి గృహం, మరో గెస్ట్ హౌస్ ను టీడీపీ నేతలు పరిశీలించినట్టు సమాచారం. రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెం ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు కొందరు చంద్రబాబు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది.

Tags : undavalli , chandrababu naiud , ap cm jagan ,ysrcp , tdp ap ,

Related posts

Leave a Comment