రెండేళ్లలో చంద్రబాబును జైలుకు పంపడం ఖాయం

టీడీపీ అధినేత చంద్రబాబును రెండేళ్లలో జైలుకు పంపడం ఖాయమని బీజేపీ ఏపీ ఇన్చార్జి సునీల్ దేవదర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులను చంద్రబాబు పక్కదోవ పట్టించి, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పేదల సంక్షేమం కోసం టీడీపీని స్థాపించి, 9 నెలలలోనే

అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. తన రాజకీయ వారసుడిగా లోకేశ్ ను చంద్రబాబు ప్రకటించడం దారుణమని అన్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టి… ఇచ్చిన వాగ్దానాన్ని ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకోవాలని కోరారు.

Related posts

Leave a Comment