కేఏ పాల్‌ బయోపిక్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు

kapaul

తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచతమైన పేరు కేఏ పాల్‌. తన వెరైటీ వ్యాఖ్యలతో నిత్యం న్యూస్‌లో ఉండే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఈయన క్రైస్తవ మత బోధకుడు కూడా. ఇక ఏపీ ఎన్నికల సమయంలో ఆయన వైఖరి మరింత హాట్ టాపిక్‌గా అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ వరకు

అన్ని రాజకీయపార్టీలపై ఆయన చలోక్తులు విసిరారు. ఏపీలో అధికారం తమ పార్టీదేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.పవన్ పార్టీ తనతో కలిసి స్వీస్ చేస్తుందంటూ నేల విడిచి వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు తమ ప్రజాశాంతి పార్టీకి వంద సీట్లు గ్యారంటీ అంటూ ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పారు. అప్పట్లో

కేఏ పాల్ అన్న ప్రతి మాట చర్చనీయాంశం…ఇటు జనానికి కూడా ఆయన తన పనులతో బాగానే ఎంటర్ టైన్ చేశారు. అలాంటి కేఏ పాల్ మీద సినిమా తీసేందుకు టాలీవుడ్‌కు చెందిన ఓ డైరెక్టర్ రెడీ అవుతున్నారు. ఓ కొత్త దర్శకుడు కేఏ పాల్ బయోపిక్‌ను తెరకెక్కించేందుక ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

మామూలుగా కే ఏ పాల్ పేరు చెబితేనే నవ్వు వస్తోంది. మరి అలాంటి క్యారెక్టర్‌ను సునీల్ చేస్తే… ఇక ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌ నాన్ స్టాప్. అయితే కేఏ పాల్ క్యారెక్టర్‌కు ప్రముఖ కమెడియన్, హీరో సునీల్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉంటారట.

దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ… టాలీవుడ్‌ వర్గాల్లో మాత్రం కేఏ పాల్ బయోపిక్‌పై హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. త్వరలోనే సినిమాను ఎనౌన్స్ చేస్తారని అంటున్నారు. అయితే ఈ సినిమా మాత్రం పొలిటికల్ డ్రామాలా తెరకెక్కించేందుకు డైరెక్టర్

రెడీఅవుతున్నారు. మరి తన జీవితంపై తెరకెక్కుతున్న సినిమాపై కే.ఏ పాల్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related posts

Leave a Comment