బీజేపీ ఎంపీ సోయం బాపురావుపై కేసు నమోదు..

bjp mp

ముస్లిం యువతపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సోయం బాపురావుపై ఆదిలాబాద్ వన్‌టౌన్‌ పోలీస్ స్టేసన్‌లో కేసు నమోదైంది. బాపురావు వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ మైనారిటీ నేతలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.కేసుపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు

జరుపుతున్నారు.ఈ నెల 14వ తేదీన ఆదిలాబాద్‌లోని గాదిగూడలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ముస్లింలపై బాపురావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఆదివాసీ యువతుల జోలికొస్తే ముస్లిం యువకుల తల నరికేస్తానని హెచ్చరించారు. బాపురావు చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం

రేపాయి.బాధ్యతగల ఓ ప్రజాప్రతినిధిగా కుల మతాలకు అతీతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి.. ఇలాంటి కామెంట్స్ చేయడం సమంజసం కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Related posts

Leave a Comment