నిరుద్యోగులకు శుభవార్త…ఆగస్ట్‌లో ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్

Indian-Air-

నిరుద్యోగులకు శుభవార్త… ఆగస్ట్ 27 నుంచి 30 వరకు గోవాలో ఎయిర్ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనుంది ఎయిర్‌మెన్ సెలక్షన్ సెంటర్-జోధ్‌పూర్‌. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాలన్న ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనొచ్చు. గ్రూప్-ఎక్స్ నాన్ టెక్నికల్

ట్రేడ్స్‌లో మెడికల్ అసిస్టెంట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్-పోలీస్, గ్రూప్ వై టెక్నికల్‌లో ఆటో టెక్నీషియన్ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారికి శిక్షణ సమయంలో రూ.14,500 స్టైపెండ్ లభిస్తుంది. 17 నుంచి 21 ఏళ్ల వయస్సుగల యువకులు రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనొచ్చు.

1999 జూన్, 2003 జనవరి మధ్య జన్మించినవారికే అవకాశం. ఆసక్తిగల అభ్యర్థులు వేదిక దగ్గర సర్టిఫికెట్లు చూపించి ఎన్‌రోల్ చేసుకోవాల్సి ఉంటుంది.

గ్రూప్ ఎక్స్ అభ్యర్థులు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లతో 10+2 లో 50 శాతం మార్కులతో పాస్ కావాలి. లేదా 3 ఏళ్ల పాలిటెక్నిక్ డిప్లొమాలో 50 శాతం మార్కులతో పాస్ కావాలి. లేదా మెకానికల్ డ్రాయింగ్ / సివిల్ ఇంజనీరింగ్ / మెకానికల్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ /

డ్రాఫ్ట్స్‌మ్యాన్‌షిప్‌లో డిప్లొమా పాస్ కావాలి. గ్రూప్ వై అభ్యర్థులు 10+2 లో కనీసం 50 శాతం మార్కులతో పాస్ కావాలి. ఇంగ్లీష్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరి. లేదా వొకేషన్ కోర్సులో 50 శాతం మార్కులు ఉండాలి. రిక్రూట్‌మెంట్ సమయంలో ఫిట్‌నెస్ టెస్ట్ ఉంటుంది. 1.6 కిలోమీటర్ల దూరాన్ని 6.6 నిమిషాల్లో పరుగెత్తడంతో పాటు పుషప్స్, సిటప్స్, స్క్వాట్స్ ఉంటాయి.

ఫిట్‌నెస్ టెస్ట్‌లో క్వాలిఫై అయినవారికి రాతపరీక్ష ఉంటుంది. రాతపరీక్షలో జనరల్ అవేర్‌నెస్ క్వశ్చన్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్‌ ఉంటాయి. రాతపరీక్షలో పాసైనవారికి సైకలాజికల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. ఇవన్నీ క్వాలిఫై అయిన అభ్యర్థుల్ని

ఎయిర్‌మెన్ సెలక్షన్ సెంటర్‌కు శిక్షణ కోసం పంపిస్తారు. ఆ తర్వాత ఉద్యోగాల్లో నియమిస్తారు. ఆటో టెక్నీషియన్ ట్రేడ్‌కు దరఖాస్తు చేసేవారి ఎత్తు 165 సెంటీమీటర్లు, కాలి పొడవు 99 సెంటీమీటర్లు తప్పనిసరి. మెడికల్ అసిస్టెంట్‌కు దరఖాస్తు చేసేవారి ఎత్తు 152.5 సెంటీమీటర్లు ఉండాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్-పోలీస్ పోస్టుకు ఎత్తు నిబంధన లేదు.

Related posts

Leave a Comment