ప్రజావేదికను కూల్చేస్తామన్న సీఎం జగన్..

PrajaVedika_

అమరావతిలోని ప్రజావేదికను ఎల్లుండి కూల్చివేస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ భవనాన్ని అక్రమంగా, అవినీతితో నిర్మించారని సీఎం ఆరోపించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో టీడీపీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు.

అనంతరం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ మాట్లాడుతూ.. సీఎం జగన్ కు డబ్బులు బాగా ఎక్కువ అయినట్లు ఉన్నాయని విమర్శించారు. అందుకే ప్రభుత్వ భవనాన్ని కూల్చుతామని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భవనాలను కూల్చేసుకోవాలా? లేక వాడుకోవాలా? అన్నది సీఎం జగన్ నిర్ణయమని స్పష్టం చేశారు.

Tags : prajavedika , ap tdp , ap cm jagan , chandrababu ,

Related posts

Leave a Comment