ఏపీ టీడీపీకి గుడ్ బై చెబుతున్న అంబికా కృష్ణ

ambica krishna

మొన్ననే నలుగురు రాజ్యసభ సభ్యుల్ని చేజార్చుకున్న టీడీపీలో తాజాగా మరో భారీ వికెట్ పడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన సీనియర్ నేత… అంబికా కృష్ణ ఇవాళ టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు. ఢిల్లీలో బీజేపీ నేత రామ్ మాధవ్ సమక్షంలో ఆయన బీజేపీలో

చేరబోతున్నారు. అంబికా కృష్ణతోపాటూ… ఆయన సోదరుడు అంబికా రాజా కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అట్టర్ ఫ్లాప్ అవ్వడం, 23 అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకోవడంతో ఇక టీడీపీ పనైపోయిందని భావిస్తున్న అంబికా కృష్ణ… అందుకే బీజేపీలో

చేరుతున్నారని సమాచారం.

నిజానికి ఏలూరులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే… AP FDC ఛైర్మన్‌ అయిన అంబికా కృష్ణ… నిర్మాతగా… అంబికా కృష్ణ ఆ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ఇప్పుడు ఆయనే సైకిల్ వదిలేస్తుండటంతో… మరో భారీ పంక్చర్ పడినట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంబికా కృష్ణ వెళ్లిన తర్వాత…

మరిన్ని వికెట్లు పడతాయనీ, బీజేపీ చెబుతున్నట్లు ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ చాలా జోరుగా సాగుతోందనే ప్రచారం జరుగుతోంది. త్వరలో కొందరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరబోతున్నారని సమాచారం.

Related posts

Leave a Comment