పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు.. మూడు జిల్లాల్లో నేటి నుంచి అమలు

TS police

పోలీసు ఉద్యోగంలో వీక్లీ ఆఫ్ అమలు చేయడానికి కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు ఇకపై వీక్లీ ఆఫ్ ఇవ్వాలని అమలు చేయనుంది. నల్గొండ,కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఇల్టీ నుంచి వీక్లీఆఫ్‌లు అమలు చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన

ఆదేశాలు జిల్లాల డీజీ కార్యాలయాలకు పంపించారు. ఇచ్చిన హామీ మేరకు పోలీసులకు వారాంతపు సెలవును ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేశారు అధికారులు. వారాంతపు సెలవు అమలుకు రాష్ట్ర పోలీసుశాఖ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. డ్యూటీ రోస్టర్‌ చార్ట్‌ ప్రకారం.. సిబ్బంది నిష్పత్తి ఆధారంగా వీక్లీ

ఆఫ్‌లు ప్లాన్‌ చేయాలని డీజీ కార్యాలయం అన్ని జిల్లా ఎస్పీ, కమిషనర్‌ కార్యాలయాలను ఆదేశించింది. ముందుగా ఇవాల్టీ నుంచి మూడు జిల్లాల్లో అమలు చేయనున్నారు. ఆ తర్వాత దశలవారీగా అన్నిజిల్లాల్లో అమలు చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పోలీసులు వారి కుటుంబాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. దాదాపు 50వేల పోలీసులు ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం పట్ల హర్షం వ్యక్తంచేస్తున్నారు.వీక్లీ ఆఫ్ కోసం పోలీసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. తమకూ వారంలో ఒక

రోజు సెలవు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటివరకు పోలీసులకు వీక్లీ ఆఫ్ లు ఉండేవి కాదు. కేవలం వార్షిక సెలవులకు మాత్రమే పోలీసులు అర్హులు. వార్షిక సెలవుల్లోనే సిక్ లీవ్, క్యాజువల్ లీవ్స్, ఎర్న్ లీవ్స్ కలిపి ఉంటాయి. వారాంతపు సెలవు ఇస్తే.. కొంత రిలాక్స్ అవ్వడానికి సమయం

దొరుకుతుందని, వ్యక్తిగత పనులు పూర్తి చేసుకునే వెసులుబాటు లభిస్తుందని పోలీసులు చెబుతున్నారు. తాజాగా తమకూ వీక్లీ ఆఫ్ అమలు చేస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనతో పోలీసులు, వారి కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags : telangana police ,weeklyoff ,police , dgp , ts govt ,

Related posts

Leave a Comment