విజయవాడలో భారీ అగ్నిప్రమాదం

విజయవాడలో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. పౌత్‌ ఇండియా లారీ ట్రాన్స్‌పోర్టుకు చెందిన పన్నెండు లారీలు అగ్నిప్రమాదంలో చిక్కుకున్నాయి. ఆరు లారీలో పూర్తిగా దగ్ధంకాగా, మరో లారీలు పాక్షికంగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 2 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం

జరిగినట్లు అంచనా వేశారు. నగర శివారులోని ఇబ్రహీంపట్నం ట్రక్‌టెర్మినల్‌ వద్ద అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది, ఘటనా స్థలంలో ప్రమాద సమయానికి 35 వాహనాలు ఉన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని

మంటలు ఇతర వాహనాకు విస్తరించకుండా అడ్డుకున్నారు. విజయవాడ నగర కమిషనర్‌ ద్వారకా తిరుమల రావు ఘటనా స్థలిని సందర్శించి వివరాలు సేకరించారు. ప్రమాదంలో నష్టపోయిన సౌత్‌ ఇండియా లారీ ట్రాన్స్‌పోర్టు యజమాని శ్యాంప్రసాద్‌ ఇప్పటికే కొన్నాళ్లుగా ఆర్థిక నష్టాలు

ఎదుర్కొంటున్నారని, తాజా ప్రమాదంతో ఆయన మరింత నష్టపోయారని భావిస్తున్నారు.

Related posts

Leave a Comment