కాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం

kalseshwaram

వ్యవసాయ రంగంలో అద్భుత ప్రగతి సాధించి… తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కల నెరవేరబోతోంది. తెలంగాణ ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. తన నివాసం నుంచి ఉదయం బయలుదేరిన

కేసీఆర్… మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుని హోమంలో సతీసమేతంగా పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత 10:50కి కన్నెపల్లి చేరుకుంటారు. 11.40కి పంపుహౌస్‌ను ప్రారంభిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్య

అతిథిగా హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ఆయన కన్నెపల్లికి చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం తర్వాత తిరిగి అమరావతి వెళ్లిపోతారు.

ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొంటున్న మరో ముఖ్య అతిథి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఉదయం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన.. అక్కడి నుంచీ హెలికాప్టర్‌లో మేడిగడ్డకు వెళ్లారు. మేడిగడ్డలో జరిగే ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్న తర్వాత

హెలికాప్టర్‌లో కన్నెపల్లి పంపు హౌస్‌కి వెళ్లి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. తర్వాత కాళేశ్వరం ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ అరుదైన ఘట్టం సాకారం కావాలని కోట్ల మంది ఎదురుచూస్తున్నారు.

Tags:CM KCR , Kaleshwaram , project , Kaleswaram Project ,

Related posts

Leave a Comment