ఆసక్తిని రేకెత్తిస్తోన్న ‘గుణ 369’ టీజర్

అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ‘గుణ 369’ రూపొందుతోంది. అనిల్ కడియాల – తిరుమల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు.

లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తించేదిగా వుంది. ఈ సినిమా ద్వారా కొత్త హీరోయిన్ పరిచయమవుతోంది. ఈ టీజర్ చివరిలో కార్తికేయ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ హైలైట్ గా నిలుస్తోంది. మరింత హ్యాండ్సమ్ గా ఆయన ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘హిప్పీ’ ఫలితంతో డీలాపడిపోయిన కార్తికేయకి ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి.

Tags: GUNA369, Karthikeya

Related posts

Leave a Comment