మమతా బెనర్జీ తల తెస్తే రూ. 1 కోటి… షాకింగ్ లెటర్!

Mamata-Banerjee

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఓ షాకింగ్ లెటర్ వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చంపేసి ఆమె తల తెచ్చినా, లేక ఆమెను సజీవంగా పట్టుకుని తెచ్చి అప్పగించినా, కోటి రూపాయల బహుమతి ఇస్తామని రాజీవ్ కిల్లా అనే వ్యక్తి పేరిట ఆరాంబాగ్ ఎంపీ అపురూప పొద్దార్‌ కు లేఖ అందింది. దీనిలో అతని చిరునామా, మూడు ఫోన్ నంబర్లు కూడా ఉండటం గమనార్హం. దీంతో ఆందోళనకు గురైన పొద్దార్, శీరాంపూర్ పోలీసులను ఆశ్రయించి, లేఖను ఇచ్చి ఫిర్యాదు చేశారు.

దీనిపై స్పందించిన పోలీసులు, వెంటనే రాజీవ్ కిల్లాను అదుపులోకి తీసుకోగా, తన పేరును తప్పుగా వాడుకున్నారని, లేఖతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని అతను వెల్లడించినట్టు తెలుస్తోంది. కాగా, 2014 సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైన బీజేపీ, ఇటీవల ఎన్నికల్లో ఏకంగా 18 స్థానాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత రాష్ట్రంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి.

Related posts

Leave a Comment