కేసీఆర్ దత్తత గ్రామంలో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ ప్రభంజనం ఉన్న స్థితిలో అనూహ్యంగా సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. కరీంనగర్ జిల్లా చినముల్కనూర్ ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి పరాజయం తప్పలేదు. ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీచేసిన రాజేశం ఎంపీటీసీగా విజయం సాధించారు.

తెలంగాణలో ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ 3,042 ఎంపీటీసీ స్థానాలు, 44 జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 1,101 ఎంపీటీసీ స్థానాలు, 3 జడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంది. కాగా, తెలుగుదేశం పార్టీకి 20 ఎంపీటీసీ స్థానాలు దక్కాయి. బీజేపీ 184 ఎంపీటీసీ స్థానాలను చేజిక్కించుకోగా, ఇతరులు 487 ఎంపీటీసీ స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు.

Tags: TRS, KCR, MPTC

Related posts

Leave a Comment