జగన్ కు శుభాకాంక్షలు చెప్పాలా? ఆడియో లేదా వీడియో… వాట్స్ యాప్ నంబర్ విడుదల!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఈ నెల 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు స్వయంగా కలిసి అభినందనలు తెలుపుతుంటే, మరికొందరు ప్లెక్సీలను ఏర్పాటు చేసి, ఇంకొందరు సేవా కార్యక్రమాల ద్వారా శుభాభినందనలు తెలుపుతున్నారు. ఇక వైసీపీకి ఓట్లు వేసిన సామాన్యులు జగన్ ను అభినందించాలంటే, అదేమంత సులువుకాదు. జగన్ అభిమానుల కోసం వైసీపీ 99127 90699 నెంబర్ ను  ప్రత్యేకంగా విడుదల చేసింది. ఈ నంబర్ కు వీడియో లేదా ఆడియో రూపంలో పేరు, ఊరు పేర్కొంటూ అభినందనలు పంపవచ్చని పేర్కొంది. ఇదే సమయంలో అన్ని సాక్షి దినపత్రిక కార్యాలయాల్లో బాక్స్ లు ఉంచామని, శుభాకాంక్షలు రాసి అందులో వేయవచ్చని పేర్కొంది.

Related posts

Leave a Comment