ఏపీలో భానుడి భగభగలు.. నేడు తీవ్రమైన వడగాల్పులు.. ప్రజలకు ఆర్టీజీఎస్ హెచ్చరిక!

ఆంధ్రప్రదేశ్ లోని పలుచోట్ల నేడు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశముందని ఆర్టీజీఎస్ తెలిపింది. దీనికితోడు చాలాచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది. ఈ ఉష్ణోగ్రతలు 44 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉండొచ్చని వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ఆర్టీజీఎస్ పేర్కొంది.

కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలంతా ఎక్కువగా బయట తిరగొద్దని సూచించింది. అత్యవసరమైతే లేతరంగు వస్త్రాలు ధరించే బయటకు వెళ్లాలనీ, పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని చెప్పింది. వీటితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఎండలు అదరగొడతాయని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా రాబోయే 3 రోజుల్లో ఏపీలో అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

Related posts

Leave a Comment