కవిత ఓటమికి కారణాలెన్నో..!

సిటింగ్‌ ఎంపీగా నిజామాబాద్‌ స్థానం నుంచి బరిలోకి దిగిన ముఖ్యమంత్రి తనయ.. కల్వకుంట్ల కవిత ఓటమి పాలయ్యారు. ఇందూరు లోక్‌సభ స్థానంలో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ ఫలితంపై సర్వత్రా ఆసక్తికర చర్చ చోటుచేసుకుంది. రైతులు పెద్దసంఖ్యలో పోటీకి దిగడంతో నామినేషన్ల సమయంలోనే దేశవ్యాప్తంగా ఈ నియోజకవర్గం చర్చనీయాంశమయింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కవితపై తెరాస రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ధర్మపురి శ్రీనివాస్‌ రెండో కుమారుడు భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ 62 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. 

Related posts

Leave a Comment