పిన్నవయసు సీఎం జగన్‌

తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో పిన్న వయసులో సీఎం అవుతున్న రెండో వ్యక్తిగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిలవనున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 46 ఏళ్లు. అయితే ఉమ్మడి ఏపీలో చిన్నవయసులో సీఎం అయిన తొలివ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబు. 45 ఏళ్లకే ఆయన 1995లో సీఎం అయ్యారు. ప్రస్తుతం దేశంలో ముఖ్యమంత్రులుగా ఉన్న చాలా మంది చిన్న వయసులోనే ఆ పదవి చేపట్టారు. వీరిలో అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం పెమాఖండూ ఒకరు. 2016లో ఆయన 36 ఏళ్లకే సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రాతిని థ్యం వహిస్తున్న బీజేపీ మరోసారి అధికారం చేపట్టబోతోం ది. పెమాఖండూకే పగ్గాలు అప్పగిస్తే దేశంలో పిన్నవయసు సీఎం ఆయనే అవుతారు. మేఘాలయ సీఎంగా ఉన్న కనరాడ్‌ సంగ్మా 40 ఏళ్లకు, మహారాష్ట్ర సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడణవీస్‌ 43 ఏళ్లకు, యూపీ సీఎంగా ఉన్న యోగి ఆదిత్యనాథ్‌ 44 ఏళ్లకు పగ్గాలు చేపట్టారు.

Related posts

Leave a Comment