భీమవరంలో రెండోస్థానం, గాజువాకలో మూడోస్థానం.. చతికిలపడ్డ పవన్ కల్యాణ్!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు తీవ్ర నిరాశ ఎదురయింది. జనసేన అభ్యర్థులు గెలవడం పక్కనపెడితే ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అడ్రస్సే ఇప్పుడు గల్లంతు అయింది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల ప్రకారం పవన్ కల్యాణ్ భీమవరంలో రెండో స్థానంలో కొనసాగుతుండగా, గాజువాకలో మూడోస్థానంలో కొనసాగుతున్నారు. 

రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 138 స్థానాల్లో, టీడీపీ 33 స్థానాల్లో, జనసేన ఓ సీటులో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

Related posts

Leave a Comment