ఇస్రో శాస్త్రవేత్తలకు కేటీఆర్‌ భినందనలు

isro

ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అభినందించారు. భారతీయులను గర్వపడేలా చేస్తూనే ఉన్నారని ట్విటర్‌లో ప్రశంసించారు. కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఇస్రో బృందానికి అభినందనలు చెప్పారు. అన్ని వాతావరణ

పరిస్థితుల్లో ఇక నుంచి ఆకాశం నుంచి నిఘా వేయొచ్చని పేర్కొన్నారు.

శ్రీహరి కోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌-సీ46 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్‌ఎల్‌-సీ46 వాహక నౌక 615 కిలోల బరువు గల రీశాట్‌-2బీఆర్‌1

ఉపగ్రహాన్ని 555కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం భారత సరిహద్దుల్లో రక్షణశాఖకు ఎంతగానే ఉపయోగపడనుంది. రాత్రి, పగలు మాత్రమే కాదు ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనూ నింగి నుంచి నిఘా వేయడంలో ఈ

ఉపగ్రహం కీలకపాత్ర పోషించనుంది.

Related posts

Leave a Comment