సైకిల్ పంక్చర్ అయింది..నారా టీడీపీ.. నందమూరి టీడీపీగా చీలబోతోంది

ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీ ముక్కలు కాబోతోందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ జోస్యం చెప్పారు. నారా టీడీపీ, నందమూరి టీడీపీగా నిలువునా చీలుతుందని అన్నారు. సైకిల్ పంక్చర్ అయిపోయిందని… ఉనికి కోసమే ఇతర రాష్ట్రాల నేతలను చంద్రబాబు కలుస్తున్నారని చెప్పారు.

జాతీయ రాజకీయాల్లో ఉండేందుకు చంద్రబాబు ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీతో వైసీపీకి సంబంధం ఉందంటూ చంద్రబాబు చేసిన ప్రచారం చివరకు వైసీపీకి లాభం చేకూర్చిందని ఏపీలో లగడపాటి చెప్పిన సర్వే నిజమైతే… ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్టు చంద్రబాబు అంగీకరిస్తారా?

అని ప్రశ్నించారు. జనసేన ఓట్లను చీల్చుతుందని, అది టీడీపీకి లాభిస్తుందనే చంద్రబాబు వ్యూహం బెడిసికొట్టిందని చెప్పారు.

Related posts

Leave a Comment