‘హ్యాపీబర్త్‌డేఎన్టీఆర్’.. ట్రెండింగ్‌లో టాప్

హ్యాపీబర్త్‌డేఎన్టీఆర్’ హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియా షేకవుతోంది. యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు పుట్టిన రోజు నేడు (మే 20). 1983లో జన్మించిన తారక్ ఈ పుట్టినరోజుతో 36వ వసంతంలోకి అడుగుపెట్టారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు మనవడిగా, ఆయన నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో రారాజుగా దూసుకెళుతూ.. తిరుగులేని స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారు తారక్. “బాలరామాయణం” మూవీతో మొదలైన ఆయన నటప్రస్థానం.. స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి, యమదొంగ, బృందావనం, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ, అరవింద సమేత వంటి వైవిధ్య చిత్రాలతో టాలీవుడ్ శిఖరాగ్రానికి చేరింది. చరిత్రను తిరగరాయబోతున్న ‘ఆర్ఆర్ఆర్’కు ఆయనొక అస్త్రం అయ్యేలా చేసింది. త్వరలో ‘కొమరం భీమ్’ పాత్రలో నట విశ్వరూపాన్ని ప్రదర్శించబోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డేను పురస్కరించుకుని సోషల్ మీడియా అంతా తారక్ జపం చేస్తోంది. ఆయనతో నటించిన వాళ్లు, దర్శకులు, నిర్మాతలు, అభిమానులు.. తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో ‘హ్యాపీబర్త్‌డేఎన్టీఆర్’ ట్యాగ్ ట్రెండింగ్‌లో టాప్ స్థానాన్ని సొంతం చేసుకుంది.

Tags: #NTR #HBD #Tarak #RRR

Related posts

Leave a Comment