టీఆర్‌ఎస్‌దే హవా

 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే క్లీన్‌స్వీప్. పదహారు ఎంపీ స్థానాల్లో విజయఢంకా మోగించనున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీమెజార్టీతో రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకొన్న గులాబీ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ తన హవా కొనసాగించనున్నదని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టంచేశాయి. రాష్ట్రంలో ఎంపీ సీట్లన్నింటినీ టీఆర్‌ఎస్ ఏకపక్షంగా గెలుచుకోబోతున్నదని జాతీయసంస్థలు నిర్వహించిన అన్ని ఎగ్జిట్‌పోల్స్ పేర్కొన్నాయి. 45 శాతానికి పైగా ఓటర్లు టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికారని తెలిపాయి. 17 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్ 16 స్థానాలను గెలుచుకుంటుందని హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్) ప్రతినిధి వేణుగోపాలరావు పేర్కొన్నారు. మరోస్థానంలో ఎంఐఎందే విజయమని తెలిపారు.

Related posts

Leave a Comment