ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుంది.. ‘పీపుల్స్ పల్స్’, ‘ఐ పల్స్’ సర్వేలు

ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందని పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే చెబుతోంది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 112 సీట్లలో వైసీపీ విజయం సాధించవచ్చని, అధికార టీడీపీ 59 స్థానాలతో సరిపెట్టుకుంటుందని తెలిపింది. జనసేన పార్టీ నాలుగు స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్టు భావించింది. లోక్ సభ స్థానాల విషయానికొస్తే వైసీపీకి 18 నుంచి 21 స్థానాలు, టీడీపీకి 4 నుంచి 6 స్థానాలు లభిస్తాయని తెలిపింది.

మరో సర్వే సంస్థ ‘ఐ పల్స్’ అంచనా ప్రకారం..వైసీపీకి 110 నుంచి 120 స్థానాలు, టీడీపీకి 56-62, జనసేన పార్టీ 0-3 స్థానాలు లభించే అవకాశం ఉంది.

‘ఆరా’ సర్వేలో వైసీపీకి 126 స్థానాలు, టీడీపీకి 47 స్థానాలు, జనసేన పార్టీకి 0-2 స్థానాలు లభిస్తాయని తెలిపింది.  

Related posts

Leave a Comment